Saturday, January 4, 2025

AP | సమర్థవంతమైన పనితీరు, మెరుగైన పోలీసింగ్‌తో నేరాల తగ్గింపు : జిల్లా ఎస్పి బిందు మాధవ్

కర్నూల్ జిల్లా నందు పోలీసులు సమర్థ వంతంగా పని చేయడం వల్లే 2024లో నేరాలు గణనీయంగా తగ్గాయని పోలీసులు కలిసి కట్టుగా పని చేయడం వలనే సాధ్యమైoదని జిల్లా ఎస్పి జి. బిందు మాధవ్ 2024 నేర గణాంకాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం మీడియాకు తెలియచేశారు.

- Advertisement -

నేర గణాంకాలు

1) నేరాల తగ్గుదల:

2023 లో నమోదైన కేసులు 7,877 నమోదు కాగా, 2024లో 5,053కేసులు నమోదు అయినవి. 2024 లో 35.85 శాతం ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గింది.

2) హత్యలు, హత్యాయత్నం,కిడ్నాప్ కేసులు:

2023 లో38 హత్య కేసులు, 2024లో 31 హత్య కేసులు,2023 లో 48 హత్యాయత్నం కేసులు, 2024లో 39 హత్యాయత్నం కేసులు, 2023 లో15 కిడ్నాప్ కేసులు,2024లో 15 కిడ్నాప్ కేసులు నమోదు అయినవి, గత సంవత్సరo తో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టాయి.

3) ప్రాపర్టీ నేరాలు:

2024 లో మొత్తం ప్రాపర్టీ Rs. 5,65,02791 కోల్పోయింది. రికవరీ Rs.3,67,54,902 ( 65.05 శాతం) రికవరీ చేయడమైనది.

డెకాయిటి:

2023లోఎలాంటి కేసులు నమోదు కాలేదు. 2024లో 1 కేసు నమోదు అయినది.

రాబరీ :-

2023లో 2 కేసులు, 2024లో 4 కేసులు నమోదు అయినవి.

దొంగతనాలు:

2023లో 149 కేసులునమోదు అయినవి,2024లో138కేసులు నమోదు అయినాయి.గత సంవత్సరo తో పోల్చుకుంటేతగ్గుముఖంపట్టాయి.

పగటి దొంగతనాలు:-

2023లో 27 కేసులు నమోదు కాగా,2024లో 25 కేసులు నమోదు అయినాయి.గత సంవత్సరo తో పోల్చుకుంటే 7.41 % తగ్గుముఖంపట్టాయి.

రాత్రి దొంగతనాలు:-

2023లో 122కేసులునమోదు కాగా,2024లో 113 కేసులు నమోదు అయినాయి. గత సంవత్సరo తో పోల్చుకుంటే 7.83% తగ్గుముఖంపట్టాయి.

4) రోడ్డు ప్రమాదాలు:

2023లో 499రోడ్డు ప్రమాదాలు, 2024 లో 523ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ ల గుర్తించి శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాము.

5) మహిళల పై అఘాయిత్యాలు:

2023లో 1 వరకట్న మరణం కేసు, 2024లో 1 వరకట్న మరణం కేసు నమోదు అయినది. 2023 లో 12 అత్యాచార కేసులు, 2024లో 10 కేసులు నమోదు అయినవి.2023 లో 22 పోక్సో గ్రేవ్ కేసులు, 2024లో 30 పోక్సో గ్రేవ్ కేసులు నమోదు అయినవి. 2023 లో 22 పోక్సో నాన్ గ్రేవ్ కేసులు, 2024లో 32 పోక్సో నాన్ గ్రేవ్ కేసులు నమోదు అయినవి.

6)154 బాలికల మిస్సింగ్ కేసుల్లో 147 చేధించాం. 244 మహిళల మిస్సింగ్ కేసుల్లో 232 చేధించాం( ట్రేస్ చేశాం).

7) ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారం

2023లో 152 కేసులు, 2024లో 118 కేసులు . 22.37 శాతం తగ్గుముఖం పట్టాయి.

8) సైబర్ నేరాలు :

2023లో 41 కేసులు, 2024లో 104 కేసులు నమోదుఅయినాయి. రూ. 56,37,000 ఫిర్యాదుదారుల ఖాతాలకు రీ-ఫండ్ చేయబడింది.మొత్తం Rs. 2,10,00,000వివిధ బ్యాంకుల్లో చేయబడ్డాయి.

9) సోషల్ మీడియానేరాలు :

2024 లో 56 కేసులు నమోదుఅయినాయి.

10) పబ్లిక్ గ్రీవెన్స్ :

2024 లో 1181 పిర్యాదులు వచ్చినాయి, 970 పిర్యాదులు పరిష్కారం అయినవి .

11) లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం:

2024లో 4 విడతలు గా జరిగిన లోక్ అదాలత్ లో 3220 కేసులను పరిష్కరించడం జరిగింది. కర్నూలు జిల్లా కు 3 వ లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే 3 వ స్థానం , 4 వ లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే మొదటి స్ధానం లభించింది.

మొబైల్ రీకవరీ మేళా :

బాధితులు పొగొట్టుకున్న మొత్తం 587 మొబైల్స్ ఫోన్ల ను రికవరీ చేసి రికవరీ మేళాలో బాధిత ప్రజలకు అందజేశారు. వాటి విలువ 1.34 కోట్ల విలువ చేస్తుంది. కర్నూల్ పోలీస్ ఇన్ మొబైల్ తెఫ్ట్ లింకు ను క్లిక్ చేసి మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి పోలీసులు కృషి చేశారు.

జిల్లాలో నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి దాతాల సహాకారం తో 5 వేల సీసీటీవీ లను ఏర్పాటు చేయడానికి సిధ్దం చేశామనీ ఎస్పీ తెలిపారు. ప్రతి పోలీసుస్టేషన్ కి ఒక డ్రోన్ కెమెరా ఉండే విధంగా కృషి చేస్తున్నాం. 2024 లో 09 గంజాయి స్వాధీనం కేసులు నమోదు అయినవి. వీటిలో 33 మందిని అరెస్ట్ చేసి, 55.38 కేజి గంజాయి ని సీజ్ చేయడం జరిగింది.

మైనర్ డ్రైవింగ్ సంబంధించి 2024 లో 3,631 కేసులు నమోదు కాగా రూ.19,42,585 జరిమానా గా విధించారు. 2024 లో 63,626 ఎం వి యాక్ట్ కేసులు నమోదు కాగా,2,40,38,723 జరిమానా రూపంగా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి
2024 లో 1,225 కేసులు నమోదు కావడం గమనారం.

ఏపీ ప్రోహబినేషన్ కు సంబంధించి 2024 లో 356 కేసులు నమోదు కాగా ,వీటిలో 515 మంది అరెస్ట్ చేసి, 30 వాహనాలు, 6,962 లీటర్స్ నాటు సారా ను సీజ్ చేయడం అయినది. ఎక్సైజ్ శాఖకు సంబంధించి 2024 లో 736 కేసులు నమోదు కాగా 951 మందిని అరెస్ట్ చేసి, 217 వాహనాలు , 21,357 లీటర్స్ లిక్కర్ ను సీజ్ చేయడం అయినది.

65 మట్కా కేసులు 2024 లో నమోదు కాగా 162 మందిని అరెస్ట్ చేసి రూ.7,22,542 నగదును సీజ్ చేశారు. 2024 గ్యాంబ్లింగ్ కేసులకు సంబంధించి 252 కేసులు నమోదు కాగా 1,251 మందిని అరెస్ట్ చేసి రూ.72,93,28 సీజ్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ సంబంధించి 2024 లో 03 కేసులలో 31 మందిని అరెస్ట్ చేసి రూ.6,50,300 సీజ్ చేయడం అయినది.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement