Tuesday, November 26, 2024

Followup : రేపే పది పరీక్షల ఫలితాలు.. విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి బొత్స..

అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విజయవాడలోని ఓ హోటల్లో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 776 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్‌ 27 నుంచి మే తొమ్మిదో తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా.. ఆరు లక్షల 21 వేల 799 మంది విద్యార్థులు రాశారు. పరీక్షలు పూర్తయిన 25 రోజుల్లోనే రికార్డు స్థాయిలో మూల్యాంకనం పూర్తి చేసి ఈ నెల 4న(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే శనివారం 11 గంటల తర్వాత ఫలితాల విడుదలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి చేతుల మీదుగా ఫలితాల విడుదల కార్యక్రమం జరగనుంది. పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజల్ట్స్‌.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌ ను సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement