Tuesday, November 19, 2024

Breaking: కోవిడ్ వ్యాప్తికి స్కూళ్లకు సంబంధం లేదు: ఏపీ విద్యాశాఖ మంత్రి

తల్లిదండ్రుల అనుమతితోనే స్కూళ్లు రీఓపెన్ చేశామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు సంక్రాంతి సెలవుల తర్వాత మొదలు అయ్యాయి అని అన్నారు. విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నారని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరీక్షలు నిర్వహించేలా ఇప్పుడు పాఠశాలల్లో పాఠ్యంశాలు బోధన జరుగుతోందన్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్ళ లో అల్ పాస్ అనే విధానం అనుసరించాం అని పేర్కొన్నారు.

భవిష్యత్ లో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు దృష్టి పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి సురేష్ తెలిపారు. 26 లక్షల మంది విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తి అయ్యిందని చెప్పారు. ఉపాధ్యాయులుకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి చేశామన్నారు. కోవిడ్ మూడో వేవ్ వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూనే పాఠ్యంశాలు పూర్తి చేస్తున్నామని వివరించారు. 150 రోజుల పాటు నిరంతాయంగా పాఠశాలలు నడిచాయన్న మంత్రి.. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే పాఠశాలలు నడుపుతున్నట్లు చెప్పారు. కోవిడ్ వ్యాప్తికి పాఠశాలలు నడపటానికి సంబందం లేదన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే తగిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement