హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యా లయం నిర్వహించే పీహెచ్డీ, ఎంఫిల్ కోర్సులతో పాటు, 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని కోర్సులలో చేరడానికి దరఖాస్తు స్వీకరణ గడువును పెంచారు. ఈమేరకు బుధవారం విద్యాత్మక విభాగం పీఠాధిపతి ఆచార్య రెడ్డి శ్యామల ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు అదనంగా రూ.100 ఆలస్య రుసుమును చెల్లించి నవంబర్ 2వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. కోర్సుల పూర్తి వివరాలను తెలుగు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించవచ్చని వెల్లడించారు.