ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పథకాలకు నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల నిధుల విడుదలకు అనుమతించాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇన్ ఫుట్ సబ్సిడీ పంపిణీతోపాటు పంట నష్టపరిహారం చెల్లించేందుకు కూడా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈసీ అనుమతి నిరాకరించడంతో ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు బ్రేక్‌పడింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగనున్నాయి. కాగా, ఈ నెల 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.