తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పట్టణంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. బర్త్ డే పేరుతో నానా హంగామా చేశారు. వందలమంది కత్తులతో ర్యాలీగా తిరిగి హల్ చల్ చేశారు. ఊరంతా తిరుగుతూ అరుపులు, కేకలతో కత్తులు చేతబూని పోలీస్ స్టేషన్ ఎదుట కేకు కటింగ్ చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ ఐదో వార్డుకు చెందిన వైసీపీ మాజీ కౌన్సిలర్ కొడుకు దుర్గాప్రసాద్ అలియాస్ చంటి పుట్టిన రోజు కావడంతో పోలీసులు కూడా సహకారం అందించడం గమనార్హం. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పట్టణం మొత్తం అనుచరులను వెంటేసుకుని కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ ర్యాలీలో పాల్గొన్న కొందరు మాజీ రౌడీ షీటర్లు. వాళ్ళు పొడవాటి కత్తులు.. తల్వార్లు చేతబట్టుకుని ఊరంతా అరుపులు కేకలతో రెచ్చిపోయారు. వాళ్ళ అరుపులు చూసి స్థానికులంతా బెంబేలెత్తిపోయారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement