Tuesday, November 26, 2024

కలెక్టర్ సారూ… మా ఊరురండి…

మండపేట : జిల్లా కలెక్టర్ హరి కిరణ్ అంటే అధికారులకు దడ. ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరొందారు. నేరుగా బాధితులు ఆయన దగ్గరకు వెళ్లి ఏదైనా సమస్య చెపితే వెంటనే పరిష్కారం చేసే నైజం ఆయనది. ఈ నేపథ్యంలో కలెక్టర్ హరి కిరణ్ ఏడిదలో ధ్యానం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి విచ్చేశారు. కాగా  కలెక్టర్ పర్యటన ఉండటంతో ఆర్ అండ్ బి అధికారులు మండపేట ఏడిద రోడ్ లో ఉన్న గోతుల్లో మట్టి పూడ్చే పనులు ఆఘ మేఘాలపై చేపట్టారు. వర్షం నీరు రోడ్ పై లేకుండా శ్రద్ధ తీసుకున్నారు. ఇక ఎన్నాళ్లు గా రోడ్ కు ఇరువైపులా పెరిగి పోయిన  చెత్త పిచ్చి మొక్కలు తొలగించి స్వామి భక్తి చాటుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ రోడ్ లో పారిశుద్ధ్య నిర్వహణ లేదంటూ ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లే వారు. కలెక్టర్ రాక పుణ్యమా అంటూ అన్ని శుభ్రం అయ్యాయి.దీంతో ఏడిద గ్రామస్తులు ప్రతి రోజు కలెక్టర్ తమ ఊరికి రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా ఉంది ప్రస్తుత పాలన అంటూ జనాలు జోక్ లు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement