Friday, November 22, 2024

తాగునీటి కోసం గ్రామాల్లోకి పెద్ద‌పులులు.. బ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

ప్ర‌భ‌న్యూస్ : ఇటీవల కాలంలో వన్య మృగాలు అడ‌విలోంచి ఆక‌లికి దాహానికి జనావాసాల్లోకి రావడం అధికంగా మారింది. అయితే కాకినాడ జిల్లాలో కూడా ఓ పెద్దపులి జ‌నావాసాల్లో తిరుగుతూ కలకలం రేపుతోంది. ఆ పులి పశువులను చంపేస్తుండడంతో ఆ చుట్టు ప‌క్క‌న‌ గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొదురుపాక, ఒమ్మంగి, ధర్మవరం, శరభవరం గ్రామాల్లో 6 గేదెలను చంపేసింది ఆ పెద్డ‌పులి.. ప్రధానంగా ఈ పెద్ద పులి ప్రత్తిపాడు మండలంలో సంచరిస్తున్నట్టు గుర్తించిన అటవీశాఖ అధికారులు అప్రమత్తమ‌య్యారు.. దీంతో 120 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. పులిని పట్టుకోవడానికి భారీ సంఖ్యలో బోన్లను ప్రత్తిపాడు మండలంలోని వివిధ గ్రామాలకు తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారి శరవణన్ నేతృత్వంలో పులిని బంధించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement