తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. గోపాలపురం మండలం కరగపాడులో పెద్దపులి సంచరిస్తుంది. శనివారం ఉదయం అడవిపందిని చంపేసింది. ఉదయాన్నే పశువులకు మేత వేయడానికి వెళ్లిన రైతులకు ఈ ఘటన కనిపించింది. ఈ ఘటనను చూసిన రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మామిడి తోటలో పులి గాండ్రింపులు విన్న రైతులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
నిన్నటి వరకు మాతంగి మెట్ట వద్ద హల్చల్ చేసిన పెద్దపులి నేడు 5 కిలోమీటర్ల సమీపంలో కరగపాడు అనే గ్రామంలో అడవి పంది పై దాడి చేయడం అక్కడ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పంట పొలాల మీద ప్రయాణించిన పులి అడుగుజాడలు క్లుప్తంగా కనిపించడంతో రైతులలో అలజడి మొదలైంది. అటవీశాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై పలు గ్రామస్తులు మండిపడుతున్నారు.