Monday, November 18, 2024

రోజుకు 26.95 లీట‌ర్ల పాలు ఇస్తూ స‌రికొత్త రికార్డ్ సృష్టించిన గేదె

మండపేట : ఆ గేదె వయసు నాలుగేళ్లు. పాలదిగుబడిలో మాత్రం అన్నిరికార్డ్ ల‌ను బ‌ద్ద‌లుకొట్టేసింది..ఏకంగా రోజుకు 26.95 లీట‌ర్లు క్షీరాన్ని ఇస్తూ అంద‌ర్నిఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ది.. వివ‌రాల‌లోకి వెళితే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ మేలుజాతి పశు పోషణ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఆయన తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశారు. ఆ గేదె గతంలో విజయవాడ, మండపేటల్లో జరిగిన రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. ఈ గేదె సాధించిన అత్యధిక దిగుబడి 26.58 లీటర్లు. ఇప్పటివరకూ ఆ గేదె తమ వద్ద ఆరు ఈతలు ఈనగా, నాలుగు దున్నపోతులు, రెండు పెయ్యదూడలు పుట్టాయని అబ్బు చెప్పారు. అందులో ఒక గేదె ఏకంగా రోజుకి 26.95 లీల‌ర్ల పాల‌ను ఇస్తూ తన తల్లి రోజుకి ఇచ్చిన 26.59 లీట‌ర్ల రికార్డ్ ను తిర‌గ‌రాసింది.. ఈ విషయాన్ని కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు ఆదివారం నిర్ధారించారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాలదిగుబడిని ఇస్తున్న పెయ్య ఆరో ఈతలో పుట్టిందని వివరించారు. వీటికి దాణాగా రోజుకు రూ.500 ఖర్చుతో పశుగ్రాసాలు, మొక్కజొన్న, ఉలవలు, తవుడు అందిస్తున్నామని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement