Wednesday, December 4, 2024

Kakinada – స్టెల్లా షిప్‌ సీజ్ చేశాం: విచారణ జరుపుతున్నాం – కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ : కాకినాడ పోర్టులో ఉన్న స్టెల్లా షిప్‌లోకి బియ్యం ఎలా వచ్చిందనే విషయాన్ని త్వరలో తెలుసుకుంటామని ఆ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. కలెక్టరేట్‌లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, షిప్ లో ఉన్న‌వి 40 శాతం రేష‌న్ బియ్య‌మేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.. ప్ర‌భుత్వం సీజ్ చేసి,ఆ త‌ర్వాత విడుద‌ల చేసిన ఆ రేష‌న్ బియ్యం షిప్ లోకి తిరిగి ఎలా చేరాయ‌నే దానిపై ద‌ర్యాప్తు చేపట్టామ‌ని చెప్పారు. గోదాం నుంచి షిప్ వరకూ రేషన్ బియ్యం ఎలా అక్రమ రవాణా అయిందో తెలుసుకుంటామన్నారు. ఇందులోని బియ్యం మొత్తం పేదల బియ్యమేనా అనే కోణంలోనూ విచారణ జరుపుతామన్నారు. దీనిపై ఐదుగురు సభ్యుల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.

ఈ బృందంలో రెవెన్యూ, పోలీసు, పౌరసరఫరాల శాఖ, కస్టమ్స్, పోర్టు అథారిటీ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రతి లోడ్ ను పరిశీలించి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో విచారిస్తామని చెప్పారు. తనిఖీలకు విధివిధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. అక్రమ బియ్యం రవాణ పై ఎవరైనా 7993332244 నంబర్ కు ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వవచ్చని తెలిపారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement