గోకవరం: మండలంలో కామరాజుపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని గోకవరం జనహిత జనరల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ జి. శక్తి నరసింహ అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులని పరీక్షించి.. పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రోగులకు బిపి, షుగర్,కంటి వైద్యం పరీక్ష నిర్వహించి.. అవసరమైనవారికి కంటి ఆపరేషన్ ని ఆరోగ్యశ్రీ కార్డు పై ఫ్రీగా చేస్తామన్నారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు రమేష్, కాళ సుబ్రహ్మణ్యం, ఆనంద్ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, క్రాంతి కుమార్,పిర్ల దివయ్య, మైలవరపు రాఘవేంద గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement