ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కోనసీమ జిల్లా పేరు మార్పు ప్రకటనపై ఆందోళన నిర్వహిస్తున్నారు ప్రజలు. కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. అమలాపురంలో వందల మంది పోలీసులు మొహరించారు. పోలీసులు లాఠీలతో ఆందోళన కారులను పోలీసులు చెదరగొడుతున్నారు. అమలాపురాన్ని అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు.. 144 సెక్షన్ విధించారు. అమలాపురం కలశం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు సాధన కమిటీ ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఆందోళన కారుల మధ్య తోపులాట జరిగింది. అయితే జిల్లా ఎస్పీపై యువకులు రాళ్లు రువ్వారు. 20మంది పోలీసులకు గాయాలయ్యాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement