Friday, November 22, 2024

కాకినాడ నుంచి శ్రీలంకకు బియ్యం.. 40వేల టన్నుల ఎగుమతి లక్ష్యం..

కాకినాడ, ఆంధ్రప్రభ: కాకినాడ నుంచి 11వేల మెట్రిక్‌ టన్నుల బియ్యంతో చన్‌గ్లోరీ-1 అనే కార్గో నౌక శ్రీలంకకు బయలుదేరి వెళ్ళింది. ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ ప్రజ లకు తినేందుకు ఆహారం లభించడం లేదు. అంత ర్యుద్ధం మొదలయ్యే దుస్థితి ఆ దేశంలో నెలకొన్నది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆపన్న హస్తమందిస్తు న్నాయి. అలాగే భారత్‌ కూడా ఆహారం, చమురు, ఇతర సహా యాలు ప్రకటించింది. ఇందులో భాగంగా కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి 11వేల టన్నుల బియ్యంతో ఒక నౌక బయలుదేరింది. అలాగే విశాఖ, గంగవరం, చెన్నై పోర్టుల నుంచి కూడా బియ్యంలోడుతో నౌకలు బయలుదేరాయి. మొత్తం 40 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి పంపాలని కేంద్రం నిర్దేశించింది. తొలివిడతగా 11వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కాకినాడకు చెందిన పట్టాభి ఆగ్రో ఫుడ్‌ సంస్థ ద్వారా శ్రీలంకకు ఎగుమతి చేసింది. వాస్తవానికి పట్టాభి ఆగ్రో ఫుడ్‌ శ్రీలంకతో బియ్యం వ్యాపారం చేస్తుంది.

గతంలోనే ఈ సంస్థ శ్రీలంకతో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. అయితే మారిన పరిస్థితుల్లో శ్రీలంక చెల్లింపులు జరపలేదన్న సందేహంతో ఈ సంస్థ ఎగుమతుల్ని ఆపేసింది. కేంద్రం ప్రకటించిన సాయానికి అనుగుణంగా పట్టాభి సంస్థ పంపే బియ్యానికి బిల్లుల చెల్లింపు బాధ్యతను తామే తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తొలి నౌక ఇక్కడి నుంచి బయలుదేరింది. ఈ నౌక సోమవారానికి శ్రీలంక చేరుకుంటుంది. ఈ నెల 15వ తేదీన శ్రీలంకలో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి. అప్పటికి 40 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement