Tuesday, November 26, 2024

క‌రోనా వారియ‌ర్ విజ‌య శేఖర్‌..

ఏడాదిగా సెలవు లేకుండా రోగుల సేవలోనే
10వేల మందికిపైగా కోవిడ్‌ పరీక్షలు
ప్రత్యేక వైద్య శిబిరంలో సేవలు
పిఠాపురం సామాజిక ఆసుపత్రి వైద్యుడి కర్తవ్య దీక్ష

పిఠాపురం, : కరోనా కష్టకాలం.. ముఖ్యంగా ఫ్రంట్‌ వారియర్స్‌కి పొంచి వున్న ప్రమాదం.. అయినా ఒక్క రోజు కూడా ఆ ప్రభుత్వ డాక్టర్‌ సెలవు పెట్టలేదు.. ఏకంగా ఏడాది కాలంగా ఆయన సెలవే తీసుకోలేదు. కరోనా రోగుల మధ్య పరీక్షలు చేయిస్తూ, వార్డుల్లో చేర్చుకుంటూ.. హూమ్‌ క్వారంటైన్‌ రోగులకు ఫోన్‌లోనే వైద్య సలహాలు ఇస్తూ.. గడిపేశాడు.. ఏడాది దాటా నెల అవుతున్నా సెలవన్న ఊసే మరిచిపోయాడు. ఆయన తూర్పుగోదావరి జిల్లా పిఠా పురం సామాజిక ఆసు పత్రి ప్రధాన వైద్యాధికారి బి విజ యశేఖర్‌. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతిని ధుల ప్రశంసలు, సన్మానాలు అందుకున్నాడు. అదీ ఆసుపత్రి ఆవరణలోనే.
ఈయన గత ఏడాది మార్చిలో కరోనా విజృంభిస్తున్న సమయంలో విజయశేఖర్‌ కంటైన్‌మెంట్‌ జోన్లు తిరుగుతూ, కోవిడ్‌ పరీక్షలు చేస్తూ, రోగులకు సూచనలు ఇస్తూ గడిపారు. మార్చి 21 నుంచి ఈ రోజు వరకూ అంటే ఏడాదిపైన నెల అయినా ఏరోజూ ఆసుపత్రి మరిచిపోలేదు. సాధారణంగా ప్రభుత్వ డాక్టర్లకు ఏడాదిలో 37 సాధారణ సెలవులు, మరో 35 ఆప్షనల్‌ సెలవులు వుంటాయి. ఇవేవీ కూడా ఆయన ఉపయోగించు కోలేదు. జిల్లాలోనే రికార్డు స్థాయిలో సుమా రు పదివేలకు పైగా కరోనా పరీక్షలు పిఠాపురం ఆసుపత్రిలోనే నిర్వహించారు. 15వందల మంది రోగులకు ఆయన వైద్యసే వలు అందించారు.
ప్రత్యేక వార్డులు కేటా యించి రోగులను చేర్చుకున్నారు. తొలినాళ్లలో అయితే నియోజకవర్గం మొతా ్తనికి పిఠాపురంలోనే నిర్వహించారు. ఒక్క క్షణం తీరిక లేదు. పైగా ఏమాత్రం ఏమారినా రోగం వచ్చే ప్రమాదం. హోమ్‌ క్వారం టైన్‌ రోగులు ఏ సమయంలో ఫోన్‌ చేసినా విజయశేఖర్‌ స్పందించారు. వారిలో మనో స్థైర్యం నింపేవారు. ఇతర దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన సుమారు 120మందికి కూడా పరీక్షలు నిర్వహించారు. వ్యాధి తీవ్రతను ముందుగా గుర్తించి స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు సహకారంతో క్వారంటైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
టీకాలు వేయడంలోనూ…
ప్రస్తుతం కరోనా నిరోధక టీకాలు వేయడంలోనూ డాక్టర్‌ చొరవ చూపుతున్నారు. ఏ ప్రాంతం వారైనా సరే టీకాలు వేస్తున్నారు. రోజుకు వంద మందికి టీకాలు వేస్తున్నారు. వార్డు సచివాలయాల్లో టీకా ఉత్సవానికి కూడా విజయశేఖర్‌ నేతృత్వం వహించారు.
కరోనా బాధ్యత మరింత పెంచింది
కరోనా మహమ్మారి తన వృత్తి బాధ్యతలను మరింతగా పెంచిందని డాక్టర్‌ విజయశేఖర్‌ తెలిపారు. ఒక పక్క మహమ్మారి గురించి ప్రపంచం అంతా భయపడి వైద్యుల వైపు చూస్తుంటే తాను సెలవు తీసుకుని ఇంట్లో కూర్చోలేకపోయానని ఆయన తెలిపారు. ఈ ఏడాది కాలంలో తాను కరోనాతో పోరాడటం కంటే వ్యాధిగ్రస్తుల్లో ధైర్యం నింపడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానన్నారు. అందుకే రోజులో 24 గంటలూ ఫోన్‌ ఆన్‌లోనే వుంచేవాడినన్నారు. తనతో పాటూ ఆసుపత్రి ఇతర వైద్యులు, సిబ్బంది కూడా కష్టపడ్డారని, వారు కూడా చాలా సెలవులు వినియోగిం చుకోలేని పరిస్థితి ఎదుర్కొన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement