Friday, November 22, 2024

ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద ఉద్ధృతి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండాలా మారాయి. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద ఉద్ధృతి వస్తుండడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 17.75అడుగులకు నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు నుంచి పంట కాల్వలకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదేవిధంగా 19 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 18.22 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement