Friday, November 22, 2024

తూర్పుగోదావరిలో కరోనా కలకలం..

అమరావతి, ఆంధ్రప్రభ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్‌కెఆర్‌ ఉన్నత పాఠశాల్లో కరోనా కలకలం రేపింది. పాఠశాలలోని 40మంది ఎన్‌ సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారిని అధికారులు ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఈనెల 18 నుంచి పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 317 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో క్యాంప్‌ కొనసాగుతుంది. వీరు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పరీక్షించిన వైద్యులు 40 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీరిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.

వీరితో తిరిగిన సహచర విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పడు తెలుసుకుంటున్నారు. గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్య కేసులు నమోదవ్వడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వైద్యశాఖాధికారులు మాత్రం కేవలం ఆరుగురు విద్యార్థులకు మాత్రమే కరోనా సోకినట్లు ధృవీకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement