Friday, November 22, 2024

బివిపి పోటీలు… బహుమతుల ప్రధానం..

తుని : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సంఘ సంస్కర్త, శ్రీ ధనలక్ష్మి జ్యూవెలరీ అధినేత దాడిశెట్టి విష్ణు చక్రం పిలుపు నిచ్చారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు.పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో దాడిశెట్టి విష్ణు చక్రం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. విద్యార్థులు చదువులో ఎంత రాణించిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు. సీనియర్లు, జూనియర్లు విభాగంలో 137 మంది విజేతలకు బహుమతులు సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వి సూర్యనారాయణ రాజు, బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. నూకరత్నం, స్కూల్ కమిటి ఛైర్పర్సన్ బి. దుర్గ,వార్డు కౌన్సిలర్ పద్మ, భారత్ వికాస్ పరిషత్ తుని శాఖ అధ్యక్షలు చదరం శివాజి, సెక్రటరీ గాజుల వేణుగోపాల స్వామి,ఎస్. వెంకటేశ్వర్లు కోశాధికారి ఎ.సత్యనారాయణ, డి వి ఎల్ ఎన్ ప్రసాద్, శివ కుమార్, చిరంజీవి, అమల రాజు , మాధవ రావు మాస్టర్, గౌతమ్, కృష్ణ , రాజు తదితరులు పాల్గొన్నారు . అనంతరం పాఠశాల ఆవరణలో ఎం వి సూర్యనారాయణ రాజు, దాడిశెట్టి విష్ణు చక్రం, స్వామి వివేకానంద విగ్రహం ప్రతిష్టకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement