Monday, November 25, 2024

కాకినాడ‌లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ్యాలెట్స్ లెక్కింపు..

కాకినాడ : ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగి న ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు నేటి ఉదయం కాకినాడ‌లోని జె ఎన్ టి యులో ప్రారంభ‌మైంది… పోటీలో మొత్తం 11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 17,467 ఓటర్లు ఉండ‌గా, 16,054 ఓట్లు పోల్ అయ్యాయి. 10 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు తహసీల్దారు స్థాయి అధికారిని నియమించారు. ప్రతీ టేబుల్‌కు ఒక తహసీల్దార్‌, ఎంపీ డీవో, ఈవోఆర్‌డీ స్థాయి అధికారి ఒకరిని నియమిం చారు. కౌంటింగ్‌ అసిస్టెంట్‌లుగా ఒక్కో టేబుల్‌కి డిప్యూటీ- తహసీల్దార్‌, ఇద్దరు వీఆర్‌వోలు ఉంటారు. మొత్తం 10 టేబుళ్లకు 10 బృందాలను నియమించడం జరిగింది. ప్రతి షిష్ట్ కి అదనంగా రెండు టీమ్ లని రిజ ర్వుడ్‌లో ఉంచారు. లెక్కింపును 24 గంటల్లో జరిగేలా ఎనిమిది గంటలకు ఒక షిప్ట్ చొప్పున మూడు షిప్ట ల్లో కౌంటింగ్‌ సిబ్బందిని నియమించారు. ముందుగా ఓట్ల‌ను 50 చోప్పున బండిల్స్ క‌ట్టే ప‌నిని ప్రారంభించారు.. ఆ త‌ర్వాత చెల్ల‌ని ఓట్ల‌ను వేరు చేస్తారు.. అనంత‌రం ప్రాధాన్య‌త ఓట్ల‌ను లెక్కిస్తారు..ఇందులో ఫలితం తేల‌క‌పోయిన‌ట్ల‌యితే ప్రిఫ‌ర‌ల్ ఓట్ల‌ను లెక్కిస్తారు.. ఈ ప్ర‌క్రియ పూర్తి అయ్యేందుకు సాయంత్రం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement