కొవిడ్ చికిత్సలో నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ భారీ జరిమానా విధించారు. జిల్లాలో 39 కొవిడ్ ప్రయివేట్ హాస్పిటల్స్ కు కోటి 54 లక్షల రూపాయల పెనాలిటీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘనలో ఒక్కో అంశానికి 2 నుండి 10 లక్షల వరకూ పెనాలిటీ విధించారు. ప్రైవేట్ ఆసుపత్రులు 48 గంటల్లో జరిమానాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు జమ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషంట్లకు ఇవ్వకపోవడం, నిర్థేశించిన రేట్లకు మించి ఫీజులు వసూలు చేయడంతో జరిమానా విధించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement