ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో భూమి సెకను పాటు కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భామి కంపించింది. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
- Advertisement -