Saturday, December 21, 2024

Earthquake : ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు..

ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో ఇవాళ‌ ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు.

ప్రకంపనలు రాగానే ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకొచ్చారు. తాళ్లూరు మండలంలో కూడా స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement