Friday, September 20, 2024

TTD | మూడు రోజుల పాటు శ్రీవారి సేవలు రద్దు!

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్న‌ట్టు ఆల‌య అధికారులు వెల్ల‌డించారు. ఆగష్టు 15 నుంచి 17వ తేదీ వరకు ఈ సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగ‌స్టు 14న అంకురార్పణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 15న తిరుప్పావడ సేవను, అలానే15 నుండి 17వ తేదీ వ‌ర‌కు జరిగే శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

ఇక‌ అంకురార్పణ పవిత్రోత్సవం ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుందని.. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. అదే విధంగా ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.

అదే సమయంలో తొండమాన్ పురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 17 నుంచి 19 వరకు సంప్రోక్షణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 16న సాయంత్రం 6 గంటలకు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ మూడు తేదీల్లో తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు శ్రీవారి ఆర్జిత సేవల రద్దును గమనించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement