Monday, November 25, 2024

TS : ఈఏపీసెట్​ ఫలితాలు విడుదల

- Advertisement -

తెలంగాణ ఈఎపి సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. 2,40,617 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కు, 91,633 మంది విద్యార్థులు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి ఎంట్రన్స్ రాశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్ లో తొలి 9 ర్యాంకులు బాలురే కైవసం చేసుకోగా.. మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించారు.

ఇంజినీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ జ్యోతిరాధిత్య సాధించగా.. రెండో ర్యాంక్ హర్ష, మూడో ర్యాంక్ రిషి శేఖర్ శుక్లా, నాలుగో ర్యాంక్ సందేశ్, ఐదో ర్యాంక్ సాయి యశ్వంత్ రెడ్డి, 6వ ర్యాంక్ కుశల్ కుమార్, 7వ ర్యాంక్ విదీత్, 8వ ర్యాంక్ రోహన్, 9వ ర్యాంకుల్లో మణితేజలు నిలిచారు.

ఇంజ‌నీరింగ్ లోనూ….

ఇంజినీరింగ్ లోనే కాదు.. అగ్రికల్చర్, ఫార్మసీల్లోనూ ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. మదనపల్లెకు చెందిన ప్రణీత ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. సెకండ్ ర్యాంక్ విజయనగరంకు చెందిన రాధాకృష్ణ సాధించారు. మూడో ర్యాంక్ హనుమకొండకు చెందిన శ్రీవర్షిణి, నాల్గవ ర్యాంక్ చిత్తూరుకు చెందిన సాకేత్ రాఘవ్, 5,6వ ర్యాంకులు హైదరాబాద్ కు చెందిన సాయి వివేక్, మహమ్మద్ అజాన్ సాత్, 7వ ర్యాంక్ తిరుపతి – వెంగమాంబపురంకు చెందిన ముకేష్ చౌదరి, 8, 9 ర్యాంకులు హైదరాబాద్ కు చెందిన భార్గవ్ సుమంత్, ఆదిత్య, 10వ ర్యాంక్ శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన దివ్యతేజ సాధించారు.

కాగా, ఈ సెట్ లో పాసైన విద్యార్థుల్లో.. తొలి ప్రాధాన్యం తెలంగాణ విద్యార్థులకే ఉంటుందని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల సీట్ల కేటాయింపుల్లో ఏపీ విద్యార్థులకు కాంపిటిషన్ ఉంటుందని, లోకల్ విద్యార్థుల తర్వాతే వారికి సీట్లను కేటాయిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement