Wednesday, November 20, 2024

EAPCET Counselling: ఈఏపీసెట్‌ అర్హత పరీక్ష.. కనీస మార్కుల్లో సడలింపు ఇచ్చిన ప్ర‌భుత్వం

కరోనా నేపథ్యంలో ఏపీ ఈఏపీ సెట్ అర్హత పరీక్ష కనీస మార్కుల్లో ప్రభుత్వం సడలింపునిచ్చింది. ఈ మేరకు eapcet-sche.aptonline.inలో నోటీసు జారీ చేసింది. ఇంజినీరింగ్‌, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈఏపీసెట్‌ ద్వారా కౌన్సెలింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌ చదువులు అంత‌గా జ‌ర‌గ‌లేదు. దీంతో ఇంజినీరింగ్‌, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలో కనీస మార్కులను ప్రభుత్వం సడలిస్తున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చింది.

ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే ఇది అమలులో ఉంటుందని ప్ర‌భుత్వం తెలిపింది. దీని ఆధారంగానే జనరల్ క్యాటగిరీలోని అభ్యర్థులు ఇంజినీరింగ్ లేదా ఫార్మసీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలకు అర్హులుగా పరిగణిస్తారు. అందుకోసమే.. ఇంటర్ 1, 2 వ సంవత్సరం పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులను పొందాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ క్యాటగిరీల్లోని విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం 40 శాతంగా నిర్ణయించారు.

ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం అన్ని సబ్జెక్టుల్లోని మార్కులను పరిగణలోకి తీసుకోరు. ఇంటర్‌లో సాధారణ అభ్యర్థులు 45 శాతం మార్కులతో, పీసీఎంలో రిజర్వ్‌ చేసిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయి ఉండాలి. అంతేకాకుండా ఈఏపీసెట్‌లో పాసైన వారు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. విద్యార్థులు ఇంటర్‌ పరీక్షల్లో పీసీఎంలో మొత్తం 45 శాతం స్కోర్‌ చేయాలి. ఇంటర్మీడియట్..1, 2వ ఏడాది పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు తప్పనిసరిగా పొందాలి. ప్రస్తుతం ఏపీలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. వెబ్‌ ఆప్షన్ల ఫిల్లింగ్‌ తేదీలను త్వరలో ఏపీ సాంకేతిక విద్యాశాఖ ప్రకటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement