Saturday, November 9, 2024

ఈ వారంలోనే ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌-21 ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఈ వారం లోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు విడుదలై నెల రోజులు దాటుతున్నా షెడ్యూల్‌ విడుదల కాకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతు న్నారు. అయితే ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా సీట్లకు ఫీజు నిర్ధారించే విషయంపై కసరత్తు కొనసాగుతుండటమే ఆలస్యానికి కారణమని అధికా రులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవ త్సరం నుంచి ప్రైవేట్‌ యూని వర్సిటీల్లో కూడా 35 సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయా లని పేర్కొంటూ చట్టం చేసింది. మరోవైపు ఈ సీట్లను ఈఏపీ సెట్‌(ఇంజ నీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)లో అర్హత సాధించిన విద్యార్థులతోనే భర్తీ చేయాలని నిర్ణ యించింది. అయితే ఈ సీట్లకు సంబంధించి విద్యార్థుల కు ప్రభుత్వమే ఫీజు రీయింబర్‌ ్సమెంట్‌ చెల్లిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫీజు నిర్ధారణలో జాప్యం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలలో ఆలస్యానికి కారణమ వుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 9 ప్రైవేట్‌ విశ్వవిద్యా లయాలు ఉండగా.. వాటిలో ఆరింట్లో వివిధ ఇంజనీ రింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నా యి. ప్రభుత్వం ప్రకటించిన 35 శాతం కన్వీనర్‌ కోటా సీట్ల ప్రకారం చూస్తే దాదాపు రెండు వేల సీట్ల వరకు ఉంటాయి.

ఫలితాలు విడుదలై ఐదు వారాలు
రాష్ట్రంలో ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదలై ఐదు వారాలు దాటుతోంది. ఆగస్ట్‌ 25న ఈఏపీసెట్‌ నిర్వ హించిన విషయం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్‌ 8న ఫలితాలను విడుదల చేసే కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. రిజల్ట్‌ వచ్చిన పది రోజుల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ ఐదు వారాలు దాటినా అడ్మిషన్లు కాదు కదా.. కనీసం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల కాకపోవడంతో విద్యార్థులతో పాటు- వారి తల్లిదండ్రు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, తెలంగాణల్లో కౌన్సెలింగ్‌ పూర్తయి కళాశబుూలల్లో తరగతులు కూడా ప్రారంభమైన పరిస్థితులు ఉన్నాయి. రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసే దిశగా తెలంగాణ విద్యాశాఖ అడుగులు వేస్తోంది. మన రాష్ట్రంలో మా త్రం అటువంటి స్పష్టత లేకపోవడం గందరగోళానికి కారణమవుతోంది. ఇతర రాష్ట్రాల సెట్లు రాసిన విద్యార్థు లు అక్కడ సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కన్వీనర్‌ కోటా ఫీజులు నిర్ధారిస్తే వెంటనే కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలకు మూడేళ్ల బ్లాక్‌ పిీరియడ్‌(2020-21 నుంచి 2022-23)కు గాను
ఫీజులను నిర్ధారిస్తూ ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు విడుదల చేసింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సూచించిన ఫీజుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. గతేడాది విడుదల చేసిన జీవో 15 ప్రకారం కళాశాలల్లో మౌలిక వసతులు, సదుపాయాలను బట్టి కనీస ఫీజు రూ. 35 వేలుగా, గరిష్ట ఫీజు రూ. 70 వేలుగా ప్రభుత్వం నిర్ధా రించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ఫీజు రూ. 70 వేలను ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు వర్తింప జేస్తామంటే.. వాటి నుంచి అంగీకారం వస్తుందా అన్న సందేహం అధికారుల్లో నెలకొంది. మరోవైపు కళాశాల ల కన్నా వర్సిటీల్లో సదుపాయాలు, బోధనా సిబ్బంది నుంచి అన్నీ మెరుగ్గా ఉంటాయి. అలాగే ప్రైవేట్‌ వర్సి టీలు తమకు వచ్చిన దరఖాస్తులను బట్టి సీట్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్సిటీల కు ఎంత మేర ఫీజు నిర్ధారించాలనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వారంలోనే తుది కసరత్తు పూర్తి చేసి, ప్రభుత్వామోదానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రభు త్వం, వర్సిటీలు ఒక అంగీకారానికి వస్తే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలకు అడ్డుగా ఉన్న సమస్యలు తొలగి పోయినట్లే.. రాష్ట్రంలో ఈ ఏడాది లక్షా 66 వేల 460 మంది విద్యార్థులు ఈఏపీసెట్‌ ఎం-టె-న్స్‌ రాయగా.. వారిలో లక్షా 34 వేల 205 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ విభాగానికి అర్హత సాధించారు. వీరందరూ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కోసం ఎదురు చూస్తున్నారు. దసరా సెలవులు కూడా పూర్తి కావడంతో ఉన్నత విద్యాశాఖ ఈ వారంలోనే షెడ్యూల్‌ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇది కూడా చదవండి.. ధర లేక కోల్డ్‌ స్టోరేజీల్లో మగ్గుతున్న మిర్చి

Advertisement

తాజా వార్తలు

Advertisement