విశాఖపట్నం, (ప్రభన్యూస్) : జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్ధుల హజరు నమోదు ప్రక్రియను ప్రభుత్వం సమూలంగా మార్చేసిన విషయం తెలిసిందే. దశాబ్దాల తరబడి అమలు చేస్తున్న అటెండెన్స్ రిజిస్టర్‌తోపాటు ఆన్‌లైన్ విధానంలో ప్రతి రోజూ విద్యార్ధుల హజరు నమోదు చేసే విధానాన్ని ప్రవేశ పెట్టింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్ధి పేరు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసిన పాఠశాల విద్యాశాఖ ఆధార్తో అనుసంధానం చేసిన వివరాల ఆధారంగా సదరు విద్యార్ధి క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నదీ..లేనిదీ రాష్ట్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించే ఏర్పాటు చేసింది.
పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును బయోమెట్రిక్ విధానంలో నమోదు చేస్తున్న విద్యాశాఖ విద్యార్ధుల హజరును నమోదు చేసేందుకు స్టూడెంట్ అటెండెన్స్ మొబైల్ అప్లికేషన్ 1.2 వెర్షన్ అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల హజరుతోపాటు మధ్యాహ్న భోజన పథక వివరాలను సైతం ఇదే యాప్‌లో నమోదు చేస్తున్నారు. విద్యార్ధులు పాఠశాలకు రాకన్నప్పటికీ వచ్చినట్టుగా హాజరు నమోదు చేసేందుకు చెయఖ పెట్టినట్లుయ్యింది. ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం లబ్దిపొందేందుకు 75శాతం హజరు నిబంధన ప్రవేశపెట్టారు.
విద్యార్ధుల ఆన్‌లైన్ హజరు నమోదు ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ప్రస్తుతం ఐఎంఎంఎస్ యాప్‌లో హజరు నమోదు చేస్తున్నారు. తాజాగా యాప్లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. కొత్త విధానం ప్రకారం తరగతి, సెక్షన్, వారీగా హజరు నమోదుచేసి విద్యార్దుల పోటోను ఆప్‌లోడ్ చేయాలి. మధ్యాహ్న భోజనానికి సంబంధించి చిక్కీలు, కోడిగుడ్లు నిల్వల వివరాలు నమోదుతోపాటు సంబంధిత పొటోలను ఆప్‌లోడ్ చేయాలని విద్యా కమిషనర్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారికి ఉత్తర్వులు అందాయి.
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital