Monday, November 18, 2024

స్వల్ప మార్పులతో దుర్గమ్మ తెప్పోత్సవం

  • క‌న‌క‌దుర్గ‌మ్మ‌ తెప్పోత్సవంలో స్వల్ప మార్పులు

శ్రీ‌శైలం డ్యామ్ నుంచి విద్యుదుత్ప‌త్తి ద్వారా దిగువ‌కు భారీగా నీటిని వ‌దులుతున్నారు. దాంతో సాగ‌ర్‌కు వ‌ర‌ద వ‌స్తోంది. నాగార్జున సాగ‌ర్ అవుట్ ఫ్లో పెర‌గ‌డంతో అక్క‌డి నుంచి ప్ర‌కాశం బ్యారేజీకి కృష్ణ‌మ్మ ప‌రుగులిడుతోంది. కాగా, విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో దసర వేడుకలు తెప్పోత్సవంతో ముగుస్తాయి. విజయ దశమి (ద‌స‌రా) రోజున సాయంత్రం దుర్గామల్లేశ్వర స్వామివారు కృష్ణానదిలో విహరిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తుది అంకానికి చేరుకుంటున్నాయి. తొమ్మిదో రోజూ కనకదుర్గమ్మ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. అయితే, ప్రకాశం బ్యారేజీలో వరద ఎక్కువగా ఉన్నందున రేపు జరిగే తెప్పోత్సవంపై సందిగ్ధత నెల‌కొంది. ఈనేపథ్యంలో స్వల్ప మార్పులతో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement