విజయవాడ ఇంద్రకీలాద్రికి పైకి భవానీలు పోటెత్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగిపోతుంది. ఇవాళ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గదేవీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూలైన్ లలో భక్తులు వేచి ఉన్నారు. ఇరుముడి శిరస్సున ధరించి అమ్మవారిని దర్శించుకొని భవానీలు తమ దీక్షను విరమిస్తున్నారు. అయితే, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భవాని మాలధారధిలో భక్తులు తరలివస్తున్నారు.
ఇక, ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున కాలినడకన ఇంద్రకీలాద్రికి భవానీల రాకతో ఇంద్రగిరలన్నీ ఎరుపెక్కాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల భారీగా భవానీలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భవానీల రాకతో.. ముందుగానే అధికారులు దానికి అనుగుణంగా విస్తృత ఏర్పాటు చేశారు. భవానీలు కొండపైకి వచ్చి అమ్మవారి దర్శనం తర్వాత మాల విరమణ కోసం వచ్చే భవానీల కోసం మల్లికార్జున మండపం దగ్గర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.