Monday, November 18, 2024

తుది మెరుగులు దిద్దుకుంటున్న ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్…

(విజయవాడ ప్రభ న్యూస్) – ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి పనుల కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుదిమెరుగులు దిద్దుకుంటుంది. సుమారు 70 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరచడం రానున్న రోజుల్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేందుకు ఈ మాస్టర్ ప్లాన్ దోహదపడనుంది.

ఈ నేపథ్యంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో జరుగుచున్న 70 కోట్ల ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు, పనుల రూపకల్పన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీఆర్ కొండలరావు నేతృత్వంలో వారి బృందం ఆదివారం ఇంద్రకీలాద్రిని పరిశీలించింది. ఆలయ ఇంజినీరింగ్ అధికారులు సదరు పనుల గురించి వీరికి పూర్తిస్థాయిలో వివరించారు. అనంతరం టెక్నికల్ బృందం వారు కొన్ని సూచనలు, సలహాలు అందజేశారు.

ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, టెక్నికల్ బృందం లో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్&దేవాదాయ శాఖ టెక్నికల్ అడ్వైజర్ ఆర్. కొండలరావు, బెంగళూరు ప్రొఫెసర్ శివ కుమార్ బాబు, ఐఐటి మద్రాస్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ జి అప్పారావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె. వి. ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి, ఇంజినీరింగ్ విభాగం మాస్టర్ ప్లాన్ ను పూర్తిస్థాయిలో పరిశీలించి చేయబోయే అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement