Sunday, November 24, 2024

AP | భారీ వర్షాలు… ఏపీ-ఒడిశా మధ్య నిలిచిన రాకపోకలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో శబరి నదితో పాటు, పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీ-ఒడిశా మధ్య ఉన్న 316 జాతీయ రహదారిపై కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. చింతూరు-కల్లేరు గ్రామాల మధ్య గండ్లు పడడంతో ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు ఆగిపోయాయి.

ఇక రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్ప‌టికే ఐఎండీ ప్రకటించింది. భారీ నేపథ్యంలో, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ఉపయోగించాలని అచ్చెన్నాయుడు అన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించేలా సిబ్బంది ఎప్పుడూ కూడా సిద్దంగా ఉండాలని ఆయన తెలిపారు. వాయుగుండం కొనసాగుతున్నందున, మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement