2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. తర్వలో అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వనుంది. ‘డీఎస్సీ-2008’ సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.. అభ్యర్థుల భవితవ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. త్వరలోనే డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్‌లు ఇస్తామని మంత్రి తెలిపారు. టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ‘2008-డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు’ మంగళవారం కలిశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: జూలై లో పది, ఇంటర్ పరీక్షలు…. ఆదిమూలపు సురేష్