Tuesday, November 26, 2024

మ‌ట‌న్ కు పోటీ ప‌డుతున్న‌ మున‌గ‌కాయలు

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సాధార‌ణ ప్ర‌జ‌లు బ్ర‌త‌క‌డ‌మే క‌ష్ట‌మ‌నుకుంటున్న త‌రుణంలో కూర‌గాయ‌లు ధ‌ర‌లు కొండెక్కి కూర్చుంటున్నాయి. మొన్న‌టి వ‌ర‌కూ ఉల్లిపాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి.. అవి ధ‌ర త‌గ్గ‌గానే.. ట‌మోటాల ధ‌ర‌లు పెరిగాయి… వాటి ధ‌ర కూడా త‌గ్గిపోగానే… ఇప్పుడు మున‌గ‌కాయల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి. ప్ర‌స్తుతం మున‌గ‌కాయ‌లు కొనాలంటే… అబ్బే ఎందుకు మ‌ట‌న్ కొంటే బెట‌రేమో అని అనుకునే రీతిలో ధ‌ర‌లు పెరిగాయి. దీంతో ప్ర‌జ‌లు ఏం కొనేట‌ట్టు లేదు… ఏం తినేట‌ట్టు లేదు… ఈ కూర‌గాయ‌ల ధ‌ర‌లు చూస్తుంటే అని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. అలాగే దేశంలో… పెట్రోల్‌, వంట గ్యాస్‌, వంట నూనెల ధ‌ర‌లు కూడా విప‌రీతంగా పెరిగాయి.

అయితే తాజాగా… చిత్తూరు జిల్లా మదనపల్లెలో కూడా కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మునగకాయలు కిలో ధర 600 రూపాయలు పెరిగింది. కిలోకి 12 నుంచి 18 వేల రూపాయలు తూగుతున్నాయి. గత మాసంలో కురిసిన భారీ వర్షాలకు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో మునగ చెట్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో తమిళనాడు రాష్ట్రం నుంచి మునగకాయలు దిగుమతి అవుతుండ‌డంతో వంగ, బీర, కాకర, బీన్స్, ముల్లంగి తదితర కూరగాయలు మార్కెట్లో కిలో 80 రూపాయల నుంచి 180 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement