యువత పెడతోవ పట్టిస్తున్న మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఐసీడీఎస్ సుపరవైజర్ సిహెచ్ రేవతి సూచించారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధంపై అవగాహన కల్పించారు. మాధకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలని ఆమె కోరారు. మత్తుపదార్థాలు- వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్యాలు సేవించడం వల్ల వచ్చే అనార్ధాలను విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా యువతపై ఎక్కువగా చెడు ప్రభావం చూపించే ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..