విశాఖపట్నం పోర్టు సమీపంలోని ఓడలో గురువారం భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కంటైనర్‌లో మొత్తం 25,000 కిలోల కొకైన్ ను ఈస్ట్ బ్యాగులలో కలిపినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. మొత్తం సరుకులో మాదక ద్రవ్యాలు ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్‌పోల్ ఇన్‌పుట్ తర్వాత, సీబీఐ ఆపరేషన్‌లో కస్టమ్స్ సహాయంతో నిషిద్ధ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖపట్నం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నంలోని సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌కు కంటైనర్ వచ్చినట్లు తెలిపారు. మొత్తం వెయ్యి బ్యాగుల్లో డ్రగ్స్ తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, కంటైనర్ విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ తో డెలివరీ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక ఆ అడ్రస్ ఆధారంగానే కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.