Thursday, November 21, 2024

Drought Mandals – సీమ జిల్లాల్లో 101 మండలాల్లో కరవు –  తేల్చి చెప్పిన ప్రభుత్వం

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : రాయలసీమ ప్రాంతానికి చెందిన 223 మండలాల్లో 101 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులో కూడా 80 మండలాల్లో కరువు తీవ్రత ఎక్కువగా ఉండగా మిగిలిన 21 మండలాల్లో కొంతమేరకు కరవు ప్రభావం ఉన్నట్టు పేర్కొంది. మొత్తం 8 జిల్లాల్లో కడప, తిరుపతి జిల్లాల్లో కరవు ప్రభావిత మండలాలు లేవని కూడా నిర్ధారించింది.  

  ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో కనికరించకపోవడం తో ఇటీవలి సంవత్సరాలలో ఎన్నడూ కనిపించని వర్షాభావ పరిస్థితులు రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడం, ఎగువన ఉన్న తుంగభద్ర నుంచి ఆశించిన నీటి ప్రవాహం లేకపోవడం తో సీమ జిల్లాల్లో ఈ ఏడాది వ్యవసాయం పలురకాలుగా దెబ్బతినే పరిస్థితులు నెలకొంటున్నాయి. దాదాపుగా 160 పైగా మండలాలపై కరువు ప్రభావం ఎక్కువగానే ఉందని ప్రత్యేక సహాయం కోసం ఆయా జిల్లా అధికారులు నివేదికలు ప్రభుత్వానికి పంపించారు.

వర్షపాతం గణాంకాల ఆధారంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన రెండు మండలాలను కలిపి 103 జిల్లాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది . ఆమేరకు జారీ అయినా గజెట్ నోటిఫికేషన్  అనంతపురం జిల్లా పరిధిలో ని   31 మండలాలలో   డి హీరేహాళ్, రాయదుర్గ, కణేకల్, విడపానకల్,  గుంతకల్, గుత్తి ,పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పెద్ద అప్పూరు, పామిడి, వజ్రకరూరు, ఉరవకొండ, గుమ్మగట్ట, బ్రహ్మసముద్రం, కల్యాణదుర్గ్, ఆత్మకూరు, కుడేరు, గార్లదిన్నె, సింగనమల, పుట్లూరు నార్పల, బి కె సముద్రం, అనంతపురం, రాప్తాడు, శెట్టూరు, కందర్పి, కంబదూరు అనే 28 మండలాల్లో కరువు తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంటోంది.

 .సత్యసాయి జిల్లా పరిధిలోని     32  మండలాలలో  నంబుల పూలకుంట,  మడకశిర ,అమరాపురం, గుదిబండ, రోళ్ల ,ఆగ;లి, పరిగి అనే ఏడు మండలాల్లో తీవ్రంగాను, కనగానపల్లి,, బత్తలపల్లి, ధర్మవరం, తాడిమర్రి, తలుపుల, ముదిగుబ్బ, బుక్కపట్నం, కొత్తచెరువు, గోరంట్ల, రొద్దం, సోమందేపల్లి, హిందూపూర్, లేపాక్షి, చిలమత్తూరు అనే 14 మండలాల్లో కొంతమేరకు కరువు ప్రభావం ఉందని పేర్కొంటోంది.  అన్నమయ్య జిల్లాకు చెందిన  30    మండలాల్లో   గాలివీడు, చిన్నమండెం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం,  గుర్రంకొండ,  కలకడ,  కె వి పల్లె,   టి సుండూరు,  పీలేరు వీరబల్లి,  తంబళ్లపల్లె,  కురబలకోట, పెద్దమండ్యం, బి కొత్తకోట , పి టి ఎం అనే 16 మండలాల్లో తీవ్రంగా, నందలూరు పెనగలూరు మండలాల్లో కొంతమేరకు కరువు ప్రభావం ఉందని పేర్కొంటోంది. 

- Advertisement -

చిత్తూరు జిల్లా కు చెందిన  34  మండలాల్లో పలమనేరు, రామకుప్పం మండలాల్లో తీవ్రంగా, రొంపిచర్ల ,గంగవరం మండలాల్లో కొంతమేరకు కరువు ప్రభావం ఉందని  పేర్కొంటోంది. కర్నూలు జిల్లా కు చెందిన   26 మండలాల్లో ఆలూరు, ఆస్పరి, సి బెళగల్, చిప్పగిరి,  దేవనకొండ, గోనెగండ్ల, గూడూరు, హాలహర్వి, హోలగుంద, కల్లూరు, కోసిగి, కోడుమూరు, కౌతాళం, కర్నూలు అర్బన్, మడికేర, మంత్రాలయం, నందవరం, ఓర్వకల్లు, పత్తికొండ, పెద్దకడుబూరు, వెల్దుర్తి, ఎమ్మిగనూరు అనే 22 మండలాల్లో తీవ్రంగా, ఆదోని క్రిష్ణగిరి మండలాలలో కొంతమేరకు కరువు ప్రభావం  ఉందని  పేర్కొంటోంది. నంద్యాల జిల్లా కు చెందిన   29 మండలాల్లో బనగానపల్లె, మిడుతూరు ,పగిడ్యాల, గడివేముల, బేతం చెర్ల అనే అయిదు మండలాల్లో తీవ్రంగా పాణ్యం మండలంలో కొంతమేరకు కరువు ప్రభావం ఉందని పేర్కొంటోంది.

అధికారికి ప్రకటన ప్రకారం తిరుపతి, కడప జిల్లాల్లో కరువు పీడిత మండలాలు లేవని తెలుస్తోంది ఈ  కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో రుణకరువు నివారణ చర్యలు చేపట్టాలని, ఆయా జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ సంబంధిత ఉత్తర్వులలో పేర్కొన్నారు

Sadness, worship, rain, loss, barren,
Advertisement

తాజా వార్తలు

Advertisement