Thursday, November 21, 2024

Drone Summit : మరి కొద్దిసేపట్లో చంద్రబాబు చేతుల మీదుగా డ్రోన్ సదస్సు ప్రారంభం

విజయవాడ – దేశంలోనే ఇవాళ అతిపెద్ద డ్రోన్ షో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించబోతున్నారు. ఈ షోకు విజయవాడ వేదిక కానుంది..విజయవాడలోని కృష్ణానది తీరం లో ఈ డ్రోన్ షో ను నిర్వహించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా అమరావతి రాజధానికి ఐకానిక్ ట్రెడ్ మార్క్ తెచ్చేందుకు సీఎం చంద్రబాబు టెక్నాలజీని మరింత సరళం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగానే విజయవాడలోఈరోజు, రేపు డ్రోన్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. డ్రోన్ సమ్మిట్ను విజయవాడలోని పున్నమి ఘాట్ దగ్గరున్న సీకే కన్వెన్షన్ లో నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈకార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు.

- Advertisement -

ఇక పున్నమి అలాగే భవాని షూట్ లలో సాయంత్రం 6 గంటలకు ఆకాశంలో ఒకేసారి 5500 డ్రోన్లు మనకు కనిపించబోతున్నాయి .

ఇలా 5500 కల్పించడం దేశంలోనే తొలిసారి. దాదాపు అర కిలోమీటర్లకు పైగా ఆకాశంలోకి వెళ్లి పలు ఆకృతులు అలాగే వివిధ రూపాలను ప్రదర్శించబోతున్నాయన్నమాట. ఇదే సమయంలో డ్రోన్ల అవసరాలు అలాగే భవిష్యత్తులో ఏ ఏ రంగాలలో వీటిని ఎలా వినియోగించుకోవాలని అంశాలపై మంగళగిరిలోని… సి కే కన్వెన్షన్ లో డ్రోన్ సబ్మిట్ కూడా నిర్వహించబోతున్నారు.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు వచ్చేస్తున్నారు. ఇక ఈ 5500 డ్రోన్ షో ను చూసి ఎందుకు…వేల సంఖ్యలో జనాలు కూడా రాబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement