Sunday, November 24, 2024

AP | పున్నమి ఘాట్‌లో డ్రోన్‌ షో.. తిలకించిన సీఎం !

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీని డ్రోన్ హబ్​గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకె కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు మంగళవారం ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు. రెండు రోజులపాటు జాతీయ స్థాయిలో ఈ సమ్మిట్‌ జరగనుంది. కాగా, విజయవాడ కృష్ణా నది తీరంలో పున్నమి ఘాట్ వద్ద డ్రోన్ షో జరుగుతోంది. దేశంలో తొలిసారిగా 5,500 డ్రోన్లతో భారీ ప్రదర్శన, లేజర్ షో నిర్వహించారు. 8 వేల మంది డ్రోన్ షో వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డ్రోన్‌ షో వీక్షించేలా విజయవాడలో నాలుగు చోట్ల డిస్‌ప్లేలు సైతం ఏర్పాటు చేశారు.

కాగా, డ్రోన్ షో సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన వారిని ఈ డ్రోన్ షోకి ఆహ్వానించడంతో, పున్నమి ఘాట్ వద్ద భారీ కోలాహలం నెలకొంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement