Sunday, January 19, 2025

Drone – పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ చెక్కర్లు…

మంగళగిరి ఆంధ్రప్రభ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం డ్రోన్ కలకలం చెలరేగింది. 20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం, జనసేన రాష్ట్ర కార్యాలయం పరిసర ప్రాంతాలలో 20 నిమిషాల పాటు డ్రోన్ చెక్కర్లు కొట్టినట్టు సమాచారం అందుతోంది.

సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు కొట్టడం కూటమి సర్కార్ లోను, జిల్లా పోలీస్ యంత్రాంగం లోనూ ఉలిక్కిపడేలా చేసింది. మధ్యాహ్నం1-30నుండి 1- 50 నిమిషాల వరకు డ్రోన్ ఆ ప్రాంత పరిసరాలలో ఎగిరింది.

దీంతో అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది జనసేన నేతలు డీజీపీకి జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే విధంగా జనసేన కార్యాలయం పై డ్రోన్ ఎగరటం పై జనసేన నేతలు పోలీస్ అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. దీనితో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ, మంగళగిరి డిఎస్పి మురళీకృష్ణ, సిఐలు ఎస్సైలు సిబ్బంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వద్దకు హుటాహుటిన చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement