అనంతపురం, : గుక్కెడు తాగునీరు ఇప్పించండి మహాప్రభో అని కోవిడ్ బారినపడి అనం తపురం సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. జెఎన్‌టి యూ సమీపం లో కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిం చారు. ఇక్కడ మంచినీటి వసతి లేకపోవడంతో కోవిడ్ బాధితులకు భోజనం, తాగునీటి వసతులు కల్పించాలని స్థానిక కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. ఆయన సౌక ర్యాల కల్పన విషయం లో పట్టీపట్టనట్లు వ్యవహరి స్తున్నారు. టిఫెన్ ఉదయం 7.30 గంటలకు పెట్టాలని ఆదేశించినా పది గంటలకు ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం 12.30 గంటలకు ఇవ్వాలని నిబంధన ఉన్నా రెండుగంటలు దాటినా భోజనం పంపిణీ చేయడంలేదు. రాత్రిపూట ఇదే పరిస్థితి. భోజనం పరిస్థితి ఎలా ఉన్నా తాగునీరు పూర్థి స్థాయిలో సరఫరా చేయకపోవడంతో బాధితులు నీటి కోసం తపించిపోతున్నారు. ఒక్కొక్క వార్డులో 20 మంది దాకా రోగులు ఉన్నారు. ఐసియు, ఆక్సిజన్, నాన్ ఆక్సిజన్, జనరల్ వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకు 20 లీటర్ల క్యాన్ ఉదయాన్నే ఏర్పాటు చేసి, చేతులు దులుపుకుంటున్నారు. భోజనం అలస్యంగా పెడుతున్న విషయాన్ని ఆకస్మిక తనిఖీల్లో గ్రహిం చిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించినా ఎటువంటి మార్పు కనిపించలేదు. ప్రతి వార్డుకు ఒకే వాటర్ క్యాన్ ఏర్పాటు చేశారు. రోజంతా నీళ్లులేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేవలం 20 వాటర్ క్యాన్‌లు ఎలా సరిపోతాయని బాధితులు ప్రశ్ని స్తున్నారు. కొందరు తమకు తెలిసిన వారు బయట నుంచి వస్తే వాటర్ బాటిళ్లు తెప్పించుకుం టున్నారు. దిక్కూమొక్కులేని వారు ఆసుపత్రిలో వచ్చే కొళాయి నీటినే వాడుకునే దుస్థితి ఏర్పడింది. కోవిడ్ బాధితులకు సౌకర్యాల కల్పన విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా.. చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చేస్తున్న హెచ్చరికలు ఏమాత్రం పనిచేయడంలేదు. భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్న కాంట్రాక్టర్ తమకు బిల్లులు రావడం లేదని చెబుతున్నారు. పైగా నాణ్యతలేని భోజనం పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. భోజ నం పాకెట్ల రూపంలో ఇస్తుండటంతో మధ్యాహ్నం పూట మెత్త బడిపోతోందని ఆవేదన చెందు తున్నారు. ఇదిలా ఉండగా కనీసం తాగేందుకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది. కొం దరు దాతలు మొదటి విడత కరోనా సమయంలో నాలుగు కోట్ల రూపాయల దాకా విరాళాలను అందించారు. మరి కొందరు తాగునీటి క్యాన్లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అప్పట్లో ఇచ్చిన నీళ్ల క్యాన్లు దాదాపు వెయ్యి వరకు మాయమైపోయాయని సిబ్బంది అంటున్నారు. క్యాన్లు ఉంటే కనీసం ఆటోల ద్వారా శుద్ది చేసిన నీటిని ఆయా వార్డుల్లో ఏర్పాటు చేయవచ్చు. వాటర్ క్యాన్లు ఉంటే కొందరు వాటర్ ప్లాంట్ల నిర్వా హకులు ఉచితంగా నీటిని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అయితే దీనికి కూడా ఆయా నిర్వా హకులు బిల్లులు వసూలు చేసుకునే పరిస్థితి ఉంద ని అనుమానిస్తున్నారు. ఒక్కొక్క వార్డుకు పది నుంచి పదిహేను క్యాన్లు అవసరం అవుతాయని చెబుతున్నారు. వేసవి కాలం కావడంతో నీటిని ఎక్కువగా తాగుతున్నారు. కేవలం ఒక క్యాన్ ఏమూలకు చాలడంలేదని చికిత్స పొందు తున్న వారు, పలువురు వాపోయారు. దీనికి తోడు వార్డుల్లో టాయిలెట్లు, బాత్ రూంలను తరచూ శుభ్రం చేయడంలేదని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, బాత్ రూంలు, టాయి లెట్లను తనిఖీ చేసి వాటిని శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అయినప్పటికీ స్పందన లేకపో యింది. పక్కనే ఉన్న క్యాన్సర్ ఆసుపత్రి చికిత్సా కేంద్రంలో కూడా సౌకర్యాలు లేక కోవిడ్ రోగులు ఇబ్బంది పడుతున్నారు.
గుక్కెడు నీళ్లివ్వండి .. అనంత సూపర్ స్పెషాల్టీ హాస్పటల్లో రోగుల ఆర్తనాదాలు…
Advertisement
తాజా వార్తలు
Advertisement