Sunday, September 8, 2024

Voting : ఎపి, తెలంగాణ‌లో ఇంటింటి పోలింగ్ ప్రారంభం

- Advertisement -

ఎపి, తెలంగాణాల‌లో ఇంటింటి ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.. వాస్త‌వ ఓటింగ్ మే 13 ప్రారంభం కానుండ‌గా, సీనియ‌ర్ సిటిజెన్స్, దివ్యాంగుల‌కు ఇంటి నుంచే ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించారు.. 85 ఏళ్లు పైబడిన వృద్దులతో పాటు పోలింగ్ కేంద్రాలకు రాలేని వికలాంగులకు ఇంటివద్దే ఓటుహక్కును వినియోగించుకోవ‌చ్చు.. ఈ ఆప్షన్ ను ఎంచుకున్నవారికి పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ.

ఎన్నికల అధికారులు వృద్దులు, వికలాంగుల ఇంటివద్దకే వెళ్లి బ్యాలెట్ పేపర్లను అందిస్తున్నారు. వారు తమకు ఇష్టమైన పార్టీ, అభ్యర్థికి ఓటేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులో వేస్తున్నారు. ఇలా హోం ఓటింగ్ కోరుకున్నవారిలో కొందరు ఇప్పటికే ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఎపిలో రాష్ట్రవ్యాప్తంగా హోం ఓటింగ్ కు అర్హత కలిగినవారు 7,28,484 మంది వున్నట్లు ఈసీ వెల్లడించింది. వీరిలో 2,11,257 మంది 85 ఏళ్ళు పైబడిన వృద్దులలు, 5,17,227 మంది వికలాంగులు వున్నారు. అయితే కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఉపయోగించుకునేందుకు ఇష్టపడుతున్నారని… మిగతావారు పోలింగ్ రోజే ఓటుహక్కను వినియోగించుకోనున్నారు. హూం ఓటింగ్ ఎంచుకున్నవారిలో వృద్దులు 14,577 మంది, వికలాంగులు 14,014 మంది వున్నారు. వారి వ‌ద్ద‌కు బ్యాలెట్ ల‌తో వెళ్లి వారినుంచి ఓట్ల‌ను సిబ్బంది స్వీక‌రిస్తున్నారు.

తెలంగాణ‌లో సైతం..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ఇంటి నుంచే ఓటు వేసే ప్రక్రియను ప్రారంభించిన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శుక్ర, శనివారాల్లో సౌలభ్యాన్ని బట్టి ఓటింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి ఓటు వేసేందుకు 23,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల అధికారులు ఇంటి ఓటింగ్‌ను 806 గ్రూపులుగా.. 885 రూట్లుగా విభజించారు. ప్రతి బృందంలో పోలింగ్ అధికారులతో పాటు వీడియో చిత్రీకరణ బృందం ఉంటుంది. ఈ నెల 6 గంటలలోగా ఇంటింటికి ఓటింగ్‌ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ పార్లమెంట్‌లో 121 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 86 మంది సీనియర్ సిటిజన్లు, 35 మంది వికలాంగులు ఉన్నారు. ఇవాళ, రేపు (శుక్ర, శనివారాలు) ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటింటికి ఓటింగ్ నిర్వహించనున్నారు. ఓటర్లకు ఫోన్ చేసి, లేదా సమాచారం ఇచ్చి వారు అందుబాటులో ఉన్నప్పుడు ఎన్నికల సిబ్బంది బృందాలుగా ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి.. ఇంటింటికి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. కాగా, ఓటర్లందరూ అందుబాటులో ఉండాలని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement