Friday, November 22, 2024

AP | ఆందోళన వద్దు.. అండ‌గా ఉంటాం : చంద్రబాబు

వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు (బుధవారం) వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. వరద బాధితులు ఆందోళన చెందవద్దని…. ప్రభుత్వం ఆదుకుంటోందని అన్నారు. వరద ప్రభావం క్రమంగా తగ్గుతోందని… అన్ని ప్రాంతాలకు వెళ్లి ఆహారం, తాగునీరు ఎక్కువగా పంపిణీ చేస్తామన్నారు. ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

తాగునీటి కోసం ట్యాంకర్లను సైతం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటినీ శుభ్రం చేయించి, రోడ్లపై బురద తొలగింపు పనులు చేపట్టనున్నామని సీఎం తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

కొట్టుకుపోయిన ఆటోలు, కార్లకు బీమా సొమ్ము వచ్చేలా చూస్తామని వెల్లడించారు. బురదమయమైన ఇళ్లను శుభ్రం చేసేందుకు ఫైర్ ఇంజన్లను వినియోగిస్తామన్నారు. బుడమేరు నుంచి కృష్ణానదికి మళ్లించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తామ‌ని తెలిపారు. ఇక‌ భవిష్యత్తులో విజయవాడకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement