Monday, November 25, 2024

AP: ప్ర‌జ‌ల‌కు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దు.. ప్ర‌భుత్వాల‌కు మాజీ ఉప రాష్ర్ట‌ప‌తి స‌ల‌హా..

న‌ర్సారావుపేట – ఏదీ ప్రజలకు ఫ్రీగా ఇవ్వకూడదు.. విద్య, వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఇక, ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్దతి కాద‌న్నారు.. ప్రజలకు ఏదీ ఫ్రీగా వ‌ద్ద‌ని, విద్య, వైద్యం ఉచితంగా అంద‌జేయ‌డంలో త‌ప్పు లేద‌న్నారు..

ఫాస్ట్ ఫుడ్స్ కు దూరం… వ్యాయ‌మానికి ద‌గ్గ‌ర..

మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలని సూచించారు. మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి అంటే కచ్చితంగా మంచి పనులు చేయాలన్నారు. శారీరకంగా దృడంగా ఉంటేనే, మానసికంగా ధృఢంగా ఉంటారు.. ప్రతిరోజూ యోగ చేయడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు మనదేశంలో ఉన్నన్ని రుచులు దేశంలో మరెక్కడా లేవన్నారు.. ఇంట్లో వంట రూమ్‌, పూజా రూమ్‌ తప్పకుండా ఉండాలన్నారు. ఇటీవల ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు.. అది ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు వెంకయ్యనాయుడు.

- Advertisement -

ముందు తెలుగు… ఆ త‌ర్వాతే ఇంగ్లీష్..
ఇంగ్లీష్ నేర్చుకోండి.. కానీ, తెలుగుని మర్చిపోవద్దు అన్నారు. ప్రతి మనిషి, ప్రతి రోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుంది.. ప్రతి వ్యక్తికి మొదటి మన దైవం కన్న తల్లిదండ్రులే అనేది గుర్తించాలన్నారు. మాతృభాషను మొదట చదువుకుని ఆర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కువ పెట్టుకోవాలన్నారు. మాజీ ఉప‌రాష్ర్ట‌ప‌తి..

Advertisement

తాజా వార్తలు

Advertisement