Wednesday, November 20, 2024

AP :ఆ మెసేజ్​లను నమ్మొద్దు.. గుంటూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్

గుంటూరు జిల్లా పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చే మెసేజ్​లను నమ్మొద్దని గుంటూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పించారు. యూట్యూబ్ వీడియోస్ లైక్ చేయాలని, హోటళ్లు రివ్యూ రాయాలంటూ సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారన్నారు.

అలా చేస్తే మన ఖాతాల్లో చిన్న మొత్తంలో నగదు వేసి నమ్మిస్తారని చెప్పారు. ఆపై పెయిడ్ టాస్క్ పేరుతో రూ.లక్షలు కాజేస్తారని హెచ్చరించారు. సైబర్ మోసాల బారిన పడితే వెంటనే తమను సంప్రదించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement