Monday, November 25, 2024

Don’t – పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ..మీర‌లా చేస్తే.. న‌న్ను తిడ‌తారు – పవన్ కల్యాణ్


నాకు చెడ్డ‌పేరు తీసుకురావొద్దు
నెంబర్‌ ప్లేట్లపై పవన్‌ కల్యాణ్‌ ఫన్నీ కామెంట్స్‌
రూల్స్ త‌ప్ప‌కుండా పాటించాల్సిందే
ఒరిజిన‌ల్ నెంబ‌ర్ ప్లేట్ లేకుండా బండి న‌డిపితే సీజ్ చేస్తారు
అంద‌రూ చ‌ట్టాల‌ను పాటించాలి
బైక్ రేసులు, అతివేగం అస్స‌లే వ‌ద్దు
అభిమానుల‌కు సూచించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెగ వైరల్‌గా మారిన ప్రచారం ఇదీ.. పవన్‌ కల్యాణ్‌ ఈసారి ఎలాగైనా గెలుస్తారని ఫిక్సయిపోయిన జన సైనికులు పోటీపడి మరీ తమ బైక్‌ నంబర్‌ ప్లేట్లపై ఇలా రాయించుకుని తిరిగారు.. ఈ ట్రెండ్‌పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సరదా వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ బుధవారం నిర్వహించిన వారాహి బహిరంగసభలో ప్రసంగించారు. అందులో ‘ ఎమ్మెల్యే గారి తాలుకా ‘ అని నంబర్‌ ప్లేట్లపై రాసుకోవడంపై స్పందించారు. దయచేసి ఎవరూ నంబర్‌ ప్లేట్లపై అలా రాసుకోవద్దని సూచించారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అని చెప్పి చెడ్డపేరు తీసుకురాకండి అని కోరారు. వాహనానికి ఒరిజినల్‌ నంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారని.. అప్పుడు ఎమ్మెల్యే గారి తాలుకా అని చెబితే వారు నన్ను తిడతార‌ని సరదాగా వ్యాఖ్యానించారు. అందరూ చట్టాలు పాటించాలని హితవు పలికారు.

బైక్ రేసులు వ‌ద్దు.. అతి వేగంగా న‌డ‌ప‌వ‌ద్దు..

- Advertisement -

యువత రోడ్లపై వేగంగా బైక్‌లు నడపవద్దని.. ఒకవేళ ఎవరికైనా రేసులు పెట్టుకోవాలని ఉంటే తన రెండెకరాల స్థలాన్ని వినియోగించుకోవచ్చని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. తన రెండెకరాల పొలంలో మడ్‌ రేసు పెడతానని.. అక్కడికి వచ్చి రైడ్‌ చేసుకోండి అని సలహా ఇచ్చారు. బైక్‌ రేసు కోసం వచ్చే వాళ్లకు హెల్మెట్లు, సేఫ్‌ గార్డులు, ఇతర రక్షణ పరికరాలు కూడా అందుబాటులో ఉంచుతానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement