Sunday, December 1, 2024

Donation : శ్రీవారికి భారీగా బంగారు ఆభ‌ర‌ణాలు

తిరుమల : శ్రీవారి నామాల్లో ఎంతో విశేషంగా వైజయంతి మాల గోవింద గోవిందా అని పిలుస్తాం. అలాంటి వైజయంతి మాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామి వారికి గురువారం సమర్పించారు దత్త తేజస్వి. మొత్తం నాలుగు వైజయంతి హారాలను తయారు చేయించారు. తిరుమలలో ఉత్సవమూర్తిగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులకు మూడు హారాలు గురువారం తిరుమలలో సమర్పించారు.

నాలుగు హారాల విలువ దాదాపు రూ.2కోట్ల పైగా ఉంటుందని తేజస్వి తెలిపారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో స్వామి వారు అత్యంత ఇష్టంగా వైజయంతి మాలను ధరించారని తెలిపారు. తిరుమలలో ఉత్సవమూర్తి అయినా మలయప్ప స్వామి వారికి వైజయంతి మాల లేదని టీటీడీ వద్ద నిర్ధారణ తీసుకొని… ప్రత్యేకంగా తెప్పించిన నీలం, వజ్రం, వైడూర్యం, పెంపు, స్వచ్ఛమైన బంగారుతో వైజయంతి మాల తయారు చేయించినట్లు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారికి రేపు ఉదయం ఈ వైజయంతీ మాలను సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి విరాళం అందించారు తేజస్వి.

Advertisement

తాజా వార్తలు

Advertisement