Wednesday, November 20, 2024

అశ్రునయనాల మధ్య డాలర్ శేషాద్రి అంత్యక్రియలు..

తిరుపతిరూరల్, ప్ర‌భ‌న్యూస్ : చిత్తూరు జిల్లా తిరుపతి 43 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో నిస్వార్దం గా సేవలందించిన డాలర్ శేషాద్రి పార్టీవ దేహానికి మంగళవారం తిరుపతి సిరిగిరి అపార్ట్ మెంట్ వద్ద బారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రమైన శేషాద్రి స్వామి ఇక లేరు అన్నది నమ్మలేకపోతునాన్నని, శేషాద్రి స్వామితో 25 సంవత్సరాల అనుబంధం కలదని, ఆయన మరణించడం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు అని, దేవుణి సేవలో తరిస్తూ …ఆరోగ్యాన్ని కూడా విస్మరించారని, ఆయన కోరిక మేరకు శ్రీవారి సేవలో వుండగానే చివరి శ్వాస విడిచారని, శేషాద్రి స్వామి రచించిన పుస్తకాలను టిటిడి ముద్రించి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని తెలిపారు.

నివాళులు అర్పించిన ప్రముఖులు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చంద్ర గిరి శాసన సభ్యులు మరియు తుడా చైర్మన్ చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభి నయ్ రెడ్డి,స్విమ్స్ డైరెక్టర్ డా.వెంగమ్మ,తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, టీటీడీ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అర్చక స్వాములతో పాటు పెద్ద సంఖ్యలో తిరుపతి ప్రజలు నివాళులు అర్పించారు.

మధ్యాహ్నం రెండు గంటలపైన పార్థివ దేహాన్ని వారి కుటుంబ సభ్యులు హరిశ్చంద్ర స్మశాన వాటికకు తరలించి అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు…

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement