విజయవాడలో ఫ్యామిలీ సూసైడ్ కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. విజయవాడ గురునానక్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్తోపాటు మిగతా వారు ఆయన కుటుంబ సభ్యులు.
సంఘటనా విషయం తెలిసిన పోలీసులు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ ఘటన ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. పోలీస్ కమిషనర్ రామకృష్ణ సంఘటనా ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహించాయి.