తిరుపతి, ప్రభన్యూస్: ప్రజలు స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు తెలిపారు. రాయల చెరువు కట్ట వద్ద స్వల్పంగా లీక్ అవుతున్న నీటిని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టిని గట్టిపరిచే పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఎత్తయిన శిక్షిత ప్రాంతాలకు చేరుతున్న ప్రజలు అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామన్నారు. డ్రోన్ కెమెరా సహాయంతో అంచనా వేస్తున్నట్లు వివరించారు.
అలాగే ప్రజలను ఎప్పటికప్పుడు ఓఎల్ఎక్స్ సెట్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలియజేశారు. చెరువు దిగువ పల్లెలోను అప్రమత్తం చేసి రాయల్ చెరువు దిగువున ఉన్న మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపి వేయడంతో పాటు. ప్రజలు అపోహలకు గురికావోద్దు సమన్వయం పాటించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలియజేయడం జరుగుతున్నది అన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.. రాయల్ చెరువు కింద భాగం 15 గ్రాముల వరకు ఉన్నాయన్నారు. వీరందరికీ ప్రత్యామ్నాయంగా శ్రీరామపురం నందు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital