న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-వైఎస్సార్సీపీ తరఫున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సంసద్ టీవీ డిబేట్లకు అనుమతించవద్దని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంసద్ టీవీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సంసద్ టీవీ సీఈవోకి మంగళవారం లేఖ రాశారు. రఘురామకృష్ణరాజు సంసద్ టీవీ నిర్వహించిన చర్చల్లో పాల్గొనడం గమనించానని, అతనిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ చేసిన ఫిర్యాదు లోక్‌సభ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉందని విజయసాయి లేఖలో పేర్కొన్నారు.
ఆయన అభిప్రాయాలు పక్షపాత ధోరణిలో ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా వైఎస్సార్సీపీ అభిప్రాయాలకు ఆయన బాధ్యత వహించడం లేదని తెలిపారు. రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ, అదేవిధంగా ఆయన పదవీకాలం పూర్తయ్యేంత వరకు, ఏపీ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ తరఫున సంసద్ టీవీ డిబేట్లలో రఘురామను అనుమతించవద్దని సీఈఓను కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.